: సైకో దాడిలో ఎస్సైకు గాయాలు
వీరంగం సృష్టించిన సైకో ఏకంగా ఎస్సైపైనే దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శంకర్ నగర్ కు చెందిన ఇసామియా ఓ సైకో. ఒక ఫంక్షన్ కు వెళ్లిన ఇసామియా అక్కడున్న శివ, బాబు అనే ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ ఎస్సై మహేష్ మరో కానిస్టేబుల్ ను వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. వీరిని చూసిన సైకో ఊహించని రీతిలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పై కూడా కత్తితో దాడి చేశాడు. గాయాలపాలైన ఎస్సై, కానిస్టేబుల్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైకో ఇసామియాను అరెస్టు చేసిన పోలీసులు... అతన్ని స్టేషన్ కు తరలించారు.