: రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్ ఇజ్జత్ తీస్తున్నారు: మర్రి శశిధర్ రెడ్డి


విభజనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కొందరు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ఎన్ డీఎంఏ అధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సున్నితమైన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని అన్నారు. హైదరాబాద్ తో పాటు కీలకమైన అన్ని అంశాలపై ఆంటోనీ కమిటీ పరిష్కారం చూపుతుందని శశిధర్ రెడ్డి తెలిపారు.

ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ఏర్పాటుకు చేటు తెస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News