: ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలుస్తాం: అశోక్ బాబు
ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలుస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. పదవుల్లో కొనసాగాలా? వద్దా? అనేది సీమాంధ్ర ఎంపీలే నిర్ణయించుకోవాలని అన్నారు. ఎంపీలు రాజీనామా చేస్తేనే యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జీవోఎం అని అశోక్ బాబు తెలిపారు. త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని అశోక్ బాబు అన్నారు. హెల్త్ కార్డుల ట్రస్టులో ఉద్యోగులకు ఎక్కువ భాగస్వామ్యం ఉండాలని ఆయన సూచించారు.