: షార్ శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ కృతజ్ఞతలు
పీఎస్ఎల్వీ సీ-25 ప్రయోగం కీలక నాలుగు దశలు దాటుకుని విజయవంతమైన నేపథ్యంలో షార్ శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. మార్స్ మిషన్ తొలి అడుగని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఈ ప్రయోగం శాస్త్రవేత్తల సమష్టి విజయమని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఈ ప్రయోగం కీలకమైనదని మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ తెలిపారు. ఈ మిషన్ కు సహకరించిన అందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ అభినందనలు తెలిపారు.