: నాలుగు రోజుల్లోనే 100 కోట్లు క్రాస్ చేసిన క్రిష్-3


బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్-3 బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తూ రికార్డుల దిశగా దూసుకుపోతోంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లను సాధించింది. నవంబర్ 1 న రిలీజైన క్రిష్-3 సోమవారం నాటికి 109 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని మార్కెట్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. ఇంతకు ముందే తొలి రోజు అత్యధిక వసూళ్లు(35.91 కోట్లు) సాధించిన చిత్రంగా క్రిష్-3 నిలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News