: హైదరాబాద్ లో మరో అత్యాచారాం.. ఏడేళ్ల బాలికపై ఆటో డ్రైవర్ దాష్టీకం
అత్యాచారాలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోందా? అవుననే అనిపిస్తోంది. నగరంలో ఎక్కడో ఓ చోట ప్రతి రోజూ ఆత్యాచార యత్నమో లేక అత్యాచారమో జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఆటో డ్రైవర్లే కారకులుగా మారుతుండటం ప్రమాదకర సంకేతాల్ని అందిస్తోంది. ఎల్బీనగర్ లో ఏడేళ్ల బాలికపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పారిపోయాడు. బాలిక బిగ్గరగా ఏడుస్తుండటంతో స్థానికులు స్పందించి బాలిక తల్లిదండ్రులకు సమాచారమందించారు. ఘటనా ప్రాంతానికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ఆటో డ్రైవర్ చేసిన దారుణాన్ని తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఆటోడ్రైవర్ పై కేసునమోదు చేసిన పోలీసులు, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ ను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.