: అప్పడం, దోశె.. అదో కేరళ సామెత: వాయలార్ వివరణ
తెలంగాణ అంశాన్ని పరిష్కరించడమంటే అప్పడం, దోశె వేసినంత సులువుకాదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి వాయలార్ రవి కొంత వెనక్కి తగ్గారు. తెలంగాణను కించపర్చే ఉద్దేశంతో తాను అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. అప్పడం, దోశె.. అదో కేరళ సామెత అంటూ వివాదాన్ని తేలికపర్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తోందని వాయలార్ వెల్లడించారు.