: తెలంగాణ, సీమాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన తమ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోం శాఖ రాసిన లేఖపై స్పందించే అంశంతో పాటు, అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనే విషయంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. నిన్న ఇరు ప్రాంతాల నేతలతో విడివిడిగా సమావేశమైన బాబు... ఈ రోజు రెండు ప్రాంతాల నేతలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోనున్నారు.