: దిగ్విజయ్ తో భేటీ అయిన కేవీపీ
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయరాదంటూ దిగ్విజయ్ ను కోరినట్టు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాధ్యమవుతుందని కేవీపీ అన్నారు. తెలుగు జాతిని కలిపి ఉంచడం కోసం అందరూ సహకరించాలని కోరారు.