: జైల్లో లాలూ ఆదాయం రోజుకు రూ. 14
900కోట్ల రూపాయల దాణా స్కాం కేసులో దోషి లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చే డబ్బు విలువ తెలుసుకుంటున్నారు. ఆయన రోజుకు 14 రూపాయలు సంపాదిస్తున్నారు. రాంచీలోని బిర్సాముండా సెంట్రల్ జైలులో ప్రస్తుతం లాలూ శిక్ష అనుభవిస్తున్నారు. దాణా స్కాం కేసులోని మిగతా నిందితులు కూడా ఈ జైల్లోనే ఉన్నారు. జైలు అధికారులు లాలూకి గార్డెనింగ్ పని అప్పగించారు. జైలు ఆవరణలో 52 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయల మొక్కలు సహా ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. లాలూ ఇప్పుడు గార్డెనింగ్ పని చూస్తున్నారు. అంటే మిగతావాళ్లు కష్టపడుతుంటే ఆయన పర్యవేక్షణ (సూపర్ వైజర్) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.