: శేషాద్రి ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో పొగలు
బెంగళూరు-కాకినాడ మధ్య నడిచే శేషాద్రి ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సాంకేతిక లోపంతో పొగలు వ్యాపించాయి. దీంతో, చిత్తూరు రైల్వే స్టేషన్ లో రైలును నిలిపేసి లోపాన్ని సరిదిద్దారు. అనంతరం, అరగంట ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. ప్రమాద సమయంలో ఆందోళనకు గురైన ప్రయాణికులు... బోగీల్లో పరుగులు తీశారు.