: మూగవారి భాషను ఇది రాసేస్తుంది


మాటరాలేదని బాధపడాల్సిన అవసరం లేదు... మూగవారు తమ సైగలను చేసి చూపితే చాలు... ఎంచక్కా వారు ఏం అనుకుంటున్నారు? అనే విషయాన్ని చక్కగా రాసేసేలా సరికొత్త కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేవలం మన సంజ్ఞలను మాటలుగాను, రాతలుగాను మార్చే కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌, చైనా శాస్త్రవేత్తలతో కలిసి ఈ సరికొత్త కంప్యూటర్‌ను తయారుచేసింది. దీనిపేరు 'కినెక్ట్‌ సైన్‌ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌లేటర్‌'. ఈ కంప్యూటర్‌ కెమెరా ద్వారా మూగవారి సంజ్ఞలను గ్రహించి వాటిని మాటలుగాను, రాతలుగాను మార్చుతుంది. అంతేకాదు, అవతలి వ్యక్తి మాటలను కూడా మూగవారికి అర్ధమయ్యేట్టు మళ్లీ సంజ్ఞలుగా మార్చేస్తుంది. ముందుగా ఆన్‌లైన్‌ ఆటలకోసం ఈ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. కాబట్టి మూగ, చెవిటి వారు తమకు కంప్యూటర్‌ పెద్దగా తెలియదని బాధపడాల్సిన పనిలేదు... మీరు చేసే సైగలను ఈ కంప్యూటరు చక్కగా అర్ధం చేసుకుని మాటలరూపంలో మార్చి చెబుతుంది.

  • Loading...

More Telugu News