: డ్రైవర్ అప్రమత్తతతో అమరావతి ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ముప్పు
అమరావతి ఎక్స్ ప్రెస్ రైలుకు డ్రైవర్ అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. గుంతకల్లు రైల్వే సిబ్బంది పొరపాటుగా గుంటూరు ట్రాక్ బదులు గుత్తి వైపు వెళ్లే ట్రాక్ కి క్లియరెన్స్ ఇచ్చారు. కిలో మీటరు దూరం వెళ్లిన తరువాత దారి తప్పినట్లు డ్రైవర్ గుర్తించాడు. వెంటనే రైలు నిలిపి వేసి అధికారులకు సమాచారమిచ్చాడు. ఆ సమయంలో అటుగా ఏ ట్రైన్ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.