: సీఎంతో ముగిసిన సీమాంధ్ర నేతల భేటీ


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. భేటీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఒక వర్గం జీవోఎం కు నివేదిక ఇవ్వడం వైపు మొగ్గు చూపితే, మరో వర్గం నివేదిక ఇస్తే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్టేనని, అప్పుడు తమ నియోజకవర్గాల్లో తిరగలేమని వాదించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ఏక వాక్య తీర్మానానికి సీమాంధ్ర నేతలు అంగీకరించినట్టు చెబుతున్నారు. దీనినే సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వార్తాహరుడు జీవోఎంకు నివేదించనున్నారు.

  • Loading...

More Telugu News