: ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఫలితాలు విడుదల
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి కిందట విడుదలయ్యాయి. ప్రాధమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి హైదరాబాదులో ఫలితాలను విడుదల చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు 766 మంది పురుషులు, 860 మంది స్త్రీలు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి నెల రోజుల్లోగా నియామక పత్రాలు పంపిస్తారు.