: శివనామస్మరణతో మార్మోగిన కోనసీమ
ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలు శివనామస్మరణతో మార్మోగిపోయాయి. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మహిళలు తెల్లవారుజాము నుంచే కార్తీక పాడ్యమి దీపాలను నదుల్లో, కాలువల్లో, సముద్రంలో వదిలారు. ఈశ్వరుణ్ణి దర్శించుకునేందుకు శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు.