: రాష్ట్రపతితో భేటీ కానున్న తెదేపా, వైకాపా
రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన తెదేపా, వైకాపా పార్టీలలో ఉత్సాహాన్ని నింపింది. ఈ పార్టీలకు చెందిన నేతలు రాష్ట్రపతితో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్న తీరుపై తమ అభ్యంతరాలను... తెదేపా, వైకాపా నేతలు రాష్ట్రపతికి నివేదించనున్నారు. విభజనకు సంబంధించి సీమాంధ్రుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రణబ్ ను కోరబోతున్నారు.