: విశాఖలో ముగ్గురి హత్య
విశాఖపట్టణంలోని పెందుర్తి మండలం చినముషిడివాడలోని కార్మికనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దీపావళి రోజున హత్యకు గురయ్యారు. ఇంటి అల్లుడు పల్లాడ అసిరినాయుడు వీరిని హతమార్చినట్టు స్థానికులు తెలిపారు. మంత్రి సన్యాసిరావు(70), అతని భార్య ఎల్లమ్మ(65), కుమారుడు సాంబ(42)లు హత్యకు గురికాగా, మరో కుమారుడు గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరి స్వస్థలం విజయనగరం జిల్లా మొరకముడిదాం కాగా, జీవనోపాధి కోసం విశాఖ జిల్లా చినముషిడివాడకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే హత్యలకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు.