: రికార్డు దిశగా హృతిక్ రోషన్ 'క్రిష్-3'
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ కొత్త రికార్డులను తిరగరాస్తున్నాడు. హృతిక్ హీరోగా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం క్రిష్-3. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలను పోషించారు. కాగా ఈ సినిమా పిల్లలను, పెద్దలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజు 25.5 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్ సాధించి విమర్శకులను మెప్పించింది క్రిష్-3.