: బృందావనంలో గృహ బహిష్కృతుల దీపావళి
చీకటి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు వెదజల్లింది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని బృందావనంలోని మీరా సహభాగిని ఆశ్రమంలోని 100 మంది వితంతువులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దశాబ్ద కాలంగా గృహ బహిష్కరణకు గురై, అభాగినులుగా మారిన వీరు తొలిసారి దీపావళి జరుపుకున్నారు. 1998లో ఈ ఆశ్రమం ప్రారంభమైన దగ్గర్నుంచి వితంతువులకు ఆశ్రయమిస్తోంది. ఈ ఆశ్రమాన్ని దత్తత తీసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. దీంతో ఇక్కడి వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది.