: కినెటా పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన భూమిని రద్దు చేయాలి: సోమిరెడ్డి


నెల్లూరు జిల్లాలోని కినెటా పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన 814 ఎకరాల భూమిని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2008-09 లో చిల్లకూరు మండలం తమ్మినపట్నం, మోమిడి గ్రామాల పరిధిలో 1980 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు ఈ భూమిని కేటాయించింది. దీనిలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఈ పవర్ ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నా ఇంతవరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన భూములు రద్దు చేయని పక్షంలో ఉద్యమిస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News