: బాల్యవివాహం చెల్లకుండా పోదు: కోర్టు
ఒక పురుషుడుకి, అతని భార్య (15 ఏళ్లకు పైన వయసు)కి మధ్య శృంగారం అత్యాచారం కిందకు రాదని ఢిల్లీలోని స్థానిక కోర్టు ఒకటి స్పష్టం చేసింది. మైనర్ ను అపహరించి, అత్యాచారం చేసిన కేసును విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ విధంగా పేర్కొంది. 21 ఏళ్లలోపున్న యువకుడు, 18 ఏళ్ల లోపున్న బాలికకు మధ్య వివాహం బాల్య వివాహం అయినప్పటికీ చెల్లకుండా పోదని స్పష్టం చేసింది. కాకపోతే ఈ వివాహం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.