: హైదరాబాద్ టీడీపీ నేతలపై మండిపడ్డ బాబు
అంతర్గత విషయాలపై కుమ్ములాడుకుంటున్న హైదరాబాద్ నగర తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏ విషయమైనా నేరుగా చర్చించాలని హితవు పలికారు. ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం సరికాదన్నారు. పార్టీ ప్రతిష్ఠ మంటగలిపేలా మీడియా ముందర మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని బాబు అన్నారు.