: ఉదయాన్నే కాఫీ అంత మంచిది కాదట!


కొందరికి ఉదయాన్నే కప్పు కాఫీ పడందే నిద్ర మత్తు వదలి పనిలో పడలేరు. దీంతో ఉదయాన్నే చక్కటి కాఫీ సేవనం చేసిన తర్వాత ఉత్సాహంగా పనిలోకి దిగుతారు. కాఫీ అతిగా కాకుండా మితంగా తీసుకోవడం మంచిదేనని ఒకవైపు అధ్యయన వేత్తలు చెబుతున్నా, ఉదయాన్నే ఇలా కాఫీతో మన రోజును ప్రారంభించడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే కాఫీతో రోజు ప్రారంభించడం వల్ల కాఫీ కారణంగా మనలోని అడ్రినలిన్‌ గ్రంధి ఉత్తేజితమై హార్మోన్లను విడుదల చేస్తుంది. కానీ కొంత సేపటి తర్వాత హార్మోన్ల ప్రభావం, ఉత్పత్తి తగ్గడంతో ఇక రోజంతా ఒత్తిడికి గురవుతామని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కాఫీ తాగడంకన్నా చక్కగా వ్యాయామంతో మన రోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టడం చాలా మంచిదని ప్రముఖ ట్రైనర్‌ పాల్‌ నికొలస్‌ చెబుతున్నారు. ఉదయాన్నే చేసే వ్యాయామం మన శరీరంలోని హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుందని, ఫలితంగా చక్కటి ఉత్సాహంతో మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని నికొలస్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News