: బాదంతో ఎంతో మేలు
బాదం పప్పులు (ఆల్ మండ్స్) కాస్త రేటెక్కువేగానీ... వాటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అనేది మాత్రం సత్యం. రోజుకు 43 గ్రాముల బాదం పప్పులను తింటే ఆకలి అనే మాట మన దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఇ వంటి పోషకాలు, శరీరానికి మేలు చేసే కొవ్వులను బాదం కలిగివుంటుంది. దీనివల్ల ఎక్కువ బాదం తిన్నా కూడా మన శరీరం బరువు పెరగకుండా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది.
బాదం పప్పు షుగరు వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వీటిలో ఉండే పీచు, ప్రోటీన్లు, కాలరీలు, రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో తోడ్పడతాయి. జిమ్‌కు వెళ్లేవారు ముందుగా స్నాక్స్ రూపంలో కొన్ని బాదం పప్పులను తింటే వాటివల్ల ఆవశ్యక పోషకాలు లభిస్తాయి. రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఆవశ్యక కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరంలోని కొలెస్టరాల్‌ను సమంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు బాదం పప్పులను తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.