: ఐదుగురి ప్రాణం తీసిన వదంతి
ఓ వదంతి ఐదుగురు ప్రయాణీకుల ప్రాణాలు తీసింది. విజయనగరం జిల్లా గొట్లాం వద్ద చెన్నయ్ వెళుతున్న బొకారో రైలులో మంటలు చెలరేగాయని అదే రైలులో వదంతులు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణీకులు గొలుసు లాగి ట్రైన్ దిగి పరుగందుకున్నారు. ఆ కంగారులో ఇతర పట్టాలపై రైళ్ళు ఏవైనా వస్తున్నాయో లేదో కూడా చూసుకోలేదు. దీంతో పార్వతీపురం నుంచి విజయవాడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.