: రోహిత్ శర్మ డబుల్ సెంచురీ


రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ గా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ తిరుగులేని ఆటతీరుతో డబుల్ సెంచురీ సాధించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా కెప్టెన్ ధోనీ అండతో రోహిత్ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో పలు రికార్డులు సాధించాడు. అత్యధిక సిక్సులు సాధించిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. కేవలం 156 బంతుల్లో రోహిత్ శర్మ అజేయంగా 203 పరుగులు సాధించాడు. డబుల్ సెంచురీ చేసిన మూడో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ధోనీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News