: పండగరోజు బంగారం ధరలు డల్
దీపావళి పండుగనాడు బంగారం ధరలు నీరసపడ్డాయి. న్యూఢిల్లీ మార్కెట్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 100 రూపాయలు తగ్గి 31,300 వద్దకు చేరింది. బంగారం ధర ఇక్కడి మార్కెట్లో తగ్గడం వరుసగా ఇది ఐదో రోజు. ఐదు రోజుల్లో తులం బంగారం 1170 రూపాయలు నష్టపోయింది. వెండి మాత్రం కిలోకి 50 రూపాయలు పెరిగి 49,150కి చేరుకుంది. బంగారం ధర గరిష్ఠ స్థాయుల్లో ఉన్నందున స్టాకిస్టుల నుంచి అమ్మకాల ఒత్తిడి వస్తోందని ట్రేడర్లు చెబుతున్నారు. విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి. అమెరికాలో తయారీ రంగం ఊహించిన దానికి మించి వృద్ధిని నమోదు చేయడంతో.. డాలర్లకు డిమాండ్ పెరిగి బంగారానికి తగ్గిందని విశ్లేషకులు అంటున్నారు.