: దేశంలోని అన్ని పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలి: యనమల
రాష్ట్ర విభజన జాతీయ సమస్య అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై రాష్ట్ర స్థాయి నేతలతో చర్చిస్తే సరిపోదని అన్నారు. జాతీయ స్థాయి సమస్యకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి అడిగారనో లేక ఉద్యమం నడిచిందనో రాష్ట్రాన్ని విభజిస్తే దేశం ముక్కలవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రాల విభజనకు జాతీయ విధానం ఉండాలని ఆయన సూచించారు.