: ఈ రోటీమేకర్‌ భలే!


రోటీ మేకర్‌ అంటే మనకు తెలిసిన మేర చపాతీ పిండిని ముద్దగా చేసి మేకర్‌లో పెడితే రోటీ తయారై బయటికి వస్తుంది. అలాకాకుండా పిండి, నీళ్లు పోస్తే చక్కగా తనకదే పిండిని కలుపుకుని ముద్దలు చేసుకుని రోటీలుగా తయారై బయటికి వస్తే... అది భలేగా ఉంటుంది కదూ... సరిగ్గా ఇలాంటి రోటీ మేకర్‌ను జింప్లిస్టిక్‌ కంపెనీ తయారుచేసింది. దీనిలో ఉండే మూడు పాత్రల్లో ఒకదానిలో గోధుమపిండి, మరోదాంట్లో నీళ్లు పోసి, చివరి పాత్రలో కావాలనుకుంటే నూనె వేయాలి. మరో విశేషమేమంటే ఇదంతా టచ్‌ సిస్టం. ఇందులో రోటీలు ఎంత మెత్తగా ఉండాలి... ఎంత నూనె ఉండాలి... ఎన్ని రోటీలు కావాలి అనేది సెట్‌ చేసుకుంటే చాలు. ఇక అన్ని పనులూ మెషిన్‌ చేసేసుకుంటుంది.

జింప్లిస్టిక్‌ కంపెనీ వ్యవస్థాపకులు మనదేశానికి చెందిన రిషీ ఇస్రానీ, ప్రనోణి నగార్‌కర్‌లు ఇలాంటి వెరైటీ రోటీ మేకర్‌ను తయారుచేశారు. ఇంట్లో ఇది చక్కగా ఉపయోగపడుతుందని, దీంతో రోటీలను తయారుచేసుకోవడం చాలా సులభమని రిషీ, ప్రనోణీ చెబుతున్నారు. డిసెంబర్‌లో దీనికి సంబంధించిన తొలిబ్యాచ్‌ మార్కెట్లోకి విడుదలకానుందట.

  • Loading...

More Telugu News