: మహిళలూ.. జీన్స్ లు వేసుకుని పురుషుల్ని రెచ్చగొట్టొద్దు: పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే వ్యాఖ్య


పశ్చిమ బెంగాల్ సీపీఎం శాసనసభ్యుడు అబ్దుర్ రజాక్ మొల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జీన్స్ లు వేసుకుని పురుషులను రెచ్చగొట్టవద్దని మహిళలకు సూచించారు. అంతేగాకుండా, వారు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా సూచించారు. జీన్స్ లు, టాప్ లకు బదులు మహిళలకు సల్వార్ కమీజ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో, అక్కడి మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీపీఎం నేత తక్షణమే క్షమాపణ చెప్పాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఓ రాజకీయ నేత మహిళలు ఏం డ్రెస్ వేసుకోవాలో నిర్ధేశించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలాయన ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

కాగా, రజాక్ అంతటితో ఆగలేదు. పనిలోపనిగా తృణమూల్ సర్కారుపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహిళల సాధికారత కోసం మమత ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని కితాబిచ్చారు. దీంతో, సొంత పార్టీ సీపీఎం కూడా ఆయనపై కారాలు మిరియాలు నూరుతోంది. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

  • Loading...

More Telugu News