: విశాఖలో భర్తను కొట్టి.. భార్యపై సామూహిక అత్యాచారం
అరాచకాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల, మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. రేపిస్టులకు ఏ శిక్షలు విధిస్తే అత్యాచారాలు ఆగుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా, విశాఖపట్నంలో కీచకులు ఓ మహిళపై భర్త సాక్షిగా విరుచుకుపడ్డారు. విశాఖలోని కంచరపాలెంలోని చాకలిగడ్డలో వివాహితపై ఈ ఉదయం ఇద్దరు యువకులు అత్యాచారానికి తెగబడ్డారు. అంతకుముందు వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించగా అతడిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో, ఆమె భర్తతో పాటు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.