: సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్న జానారెడ్డి మాటలు ఏమయ్యాయి?: శోభా నాగిరెడ్డి


తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై వైఎస్సార్సీపీ నేత శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్రులకు రక్షణ కల్పించే బాధ్యత తమదేనన్న ఆయన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిన్న ఖమ్మం జిల్లాలో విజయమ్మపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. విజయమ్మ పర్యటన పట్ల రాష్ట్ర మంత్రులు జానా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రవర్తించిన తీరు దారుణమని అన్నారు. ఈ రోజు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకల్లో శోభ పాల్గొన్నారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్సీపీ ముందుండి పోరాడుతుందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News