: విభజనపై స్పష్టత రావాలంటే ఎన్నికలకు వెళ్లాలి: లగడపాటి


రాష్ట్ర విభజనపై స్పష్టత రావాలంటే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సవాలు విసిరారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీలో తీర్మానం పెట్టైనా విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అఖిలపక్ష సమావేశం అవసరం లేదని, పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తున్న ప్రజల అభిప్రాయమే ప్రధానంగా తీసుకోవాలని ఆయన సూచించారు. దత్తపుత్రుడిని దగ్గరకు తీసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని సలహా ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డిని పార్టీ నుంచి వెళ్లిపొమ్మనే హక్కు బొత్సకు లేదన్నారు. చేతనైతే బొత్స.. జేసీ అనుమానాలు తీర్చాలని లగడపాటి సూచించారు.

  • Loading...

More Telugu News