: ఐఎస్ఐ ఏంజెటుతో ఎన్ఎస్ జీ మేజర్ కు గల సంబంధంపై విచారణ


పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఏంజెటుతో సంబంధాలున్నాయన్నఅనుమానంతో  ఎన్ఎస్ జీ మేజర్ ను ఎన్ఎస్ జీ ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం మేజర్ ను ఎన్ఎస్ జీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐఎస్ఐ ఏజెంటుకు హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల వివరాలను మేజర్ తెలిపి ఉంటారని ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) వద్ద స్పష్టమైన సమాచారం ఉందని భావిస్తున్నారు. కాగా, దేశ ద్రోహానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎన్ఎస్ జీ తీవ్రంగా హెచ్చరించింది. 

  • Loading...

More Telugu News