: ప్రధాని శ్రీలంక వెళితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి: డీఎంకే
శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశానికి ప్రధాని మన్మోహన్ హాజరవబోతున్నారన్న సమాచారం డీఎంకే అధినేత కరుణానిధికి ఆగ్రహం తెప్పించింది. తమిళుల మనోభావాలను లెక్కచేయకుండా ప్రధాని శ్రీలంకకు వెళితే... అది యూపీఏ ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. ప్రధాని శ్రీలంక పర్యటనను సపోర్ట్ చేసే యూపీఏ భాగస్వామ్య పార్టీలు... తర్వాత తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీతో పాటు, ప్రజలందరూ ప్రధాని శ్రీలంక పర్యటనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. ప్రధాని పర్యటనకు తెర వెనుక నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సమాచారం సంచలనం రేపుతోంది. దీంతో, కరుణానిధి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.