: ముజఫర్ నగర్ తాజా అల్లర్లలో ఎనిమిదిమంది అరెస్ట్


ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా ప్రాంతంలో చోటు చేసుకున్న తాజా అల్లర్ల ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, పదిహేను మందిపై బుధానా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని అన్నారు. గత అర్ధరాత్రి జరిగిన ఈ అల్లర్లలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు.

  • Loading...

More Telugu News