: 'ఐ గూగుల్' కి 'గూగుల్' స్వస్తి
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పర్సనలైజ్డ్ హోం పేజ్ ఫీచర్ 'ఐ గూగుల్' కు రేపటితో స్వస్తి పలకనుంది. 2005 మేలో ప్రారంభమైన 'ఐ గూగుల్' ప్రస్థానం 2013 నవంబర్ 1తో ముగియనుంది. అభిరుచులకు అనుగుణంగా కస్టమ్ హోమ్ పేజీని అతి సులువుగా డిజైన్ చేసుకునే వీలు కల్పించిన యూజర్ ఫ్రెండ్లీ 'ఐ గూగుల్' సేవలను ఉపసంహరించుకోవద్దని ప్రపంచం నలుమూలల నుంచి యూజర్లు గూగుల్ కు విజ్ఞాపనలు పంపించారు. కానీ, గూగుల్ ఉపసంహరణకే మొగ్గు చూపుతోంది. దీంతో, రేపటితో 'ఐ గూగుల్' కథ కంచికి చేరనుంది.