: మరింత విషమించిన హ్యూగో ఛావెజ్ ఆరోగ్యం
వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస సంబంధ సమస్య కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఓ కొత్త రకమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో మరో శస్త్రచికిత్స చేసినా ఆయన కోలుకునే అవకాశాలు తక్కువని వైద్యులు వెల్లడించారని వెనిజులా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
58 సంవత్సరాల ఛావేజ్ క్యూబాలో కొంతకాలం పాటు చికిత్స తీసుకొని 3 నెలల పాటు విశ్రాంతి తీసుకొన్నారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో వరుసగా నాలుగుసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఆయనకు కారకస్ మిలిటరీ ఆసుపత్రిలో కీమోథెరపీ నిర్వహిస్తున్నట్లు ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఎర్నెస్టో విలెగాస్ తెలిపారు. ఛావెజ్ ఆసుప్రతి పాలైన దగ్గరనుంచి ఇంతవరకు ప్రజలకు దర్శనమివ్వలేదు.