: తల్లిపాలలో కల్తీ ఉండదు.. దేశభక్తిలో కూడా కల్తీ ఉండకూడదు: మోడీ


తల్లిపాలలో కల్తీ ఉండదని, అలాగే దేశభక్తిలో కూడా కల్తీ ఉండకూడదని మోడీ తెలిపారు. ఇప్పుడు దేశంలో కుల, మత, ప్రాంత, జాతి రాజకీయాలు దేశాన్ని పతనస్థితికి తీసుకెళ్లాయని అన్నారు. భారతమాత గౌరవాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్లాలని, అందుకు కొన్ని ఉత్తమ మార్గాలు ఎంచుకోవాలని, అందుకే తాము పటేల్ విగ్రహ నిర్మాణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పటేల్ విగ్రహం నిర్మాణం ద్వారా దేశం నలుమూలలా ఐక్యతా మంత్రాన్ని చాటుతామని మోడీ ఉద్ఘాటించారు.

పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తుంటే.. అందరూ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, విగ్రహ నిర్మాణం కోసం తాము దేశాన్ని ఏకీకరణ చేయాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే ప్రతి గ్రామం పాత ఇనుపసామాన్లు విరాళంగా ఇవ్వాలని అడిగామని, దాన్ని చాలా మంది తప్పు పడుతున్నారని, వారి ఆలోచనలు తప్పులతో నిండిపోయాయని, అందుకే అలా మాట్లాడుతున్నారని అన్నారు. కానీ, తాము అలా సేకరించిన ఇనుము నుంచి శ్రేష్ఠమైన లోహాన్ని రాబట్టి అతి పెద్ద విగ్రహాన్ని తయారు చేస్తామని తెలిపారు.

దీన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అందులో ఉండే డిజిటల్ వరల్డ్ లో ఇనుము సేకరించిన ఏడు లక్షల గ్రామాల గురించి ప్రస్తావిస్తామని, అలా దేశాన్ని ఏకం చేస్తామని తెలిపారు. విగ్రహాన్ని సందర్శించేవారు తమ గ్రామం కూడా ఉండడం చూసి గర్వపడతారని తెలిపారు. భారతీయుల మూలాలైన పురాణాలు, ఇతిహాసాలను మరచి ఎదగాలనుకుంటే సాధ్యం కాదని అన్నారు.

  • Loading...

More Telugu News