: 12 గంటల వరకు వాయిదాపడిన పార్లమెంటు ఉభయసభలు
మంగళవారం ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభల్లో ఉత్తరప్రదేశ్ డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య ఉదంతం, పలు అంశాలు అలజడి సృష్టించాయి. సభ మొదలు కాగానే విపక్ష సభ్యులు ఈ అంశాలపై చర్చకు డిమాండు చేశారు.
ఇందుకు నిరాకరించిన స్పీకర్ మీరాకుమార్ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో లోక్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే తీరు ఉండడంతో అక్కడ కూడా వాయిదా తప్పలేదు.