: విద్యుత్ కోతలకు నిరసనగా 6న టీడీపీ ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా బుధవారం టీడీపీ ఆందోళన కార్యక్రమం చేపడుతోంది. హైదరాబాదు ఇందిరాపార్కు వద్ద వందలాది మంది కార్యకర్తలతో ధర్నా నిర్వహిస్తున్నట్లు టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్ టీయూసీ తెలిపింది.
సర్కారు విధిస్తున్న కోతలవల్ల సిమెంటు పరిశ్రమలు మూతపడుతున్నాయనీ, దీంతో లక్షలాది మంది కార్మికులకి ఉపాధి కరవవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పల్లెల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఎన్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేపడుతున్నట్లు వారు తెలిపారు.