: బస్సు ప్రమాద మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు
మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతదేహాలకు అధికారులు ఘటనాస్థలి వద్దే శవపరీక్ష నిర్వహించారు. అనంతరం, మృతదేహాలను హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డీఎన్ఏ ద్వారా తమ వారిని గుర్తించేందుకు మృతుల కుటుంబీకులు రెడ్ హిల్స్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో రక్త నమూనాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు. అందుకుగాను సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 040-23307138. ప్రమాదానికి గురైన బస్సు శకలాలను క్రేన్ల ద్వారా ఘటనాస్థలి నుంచి తొలగించారు.