: మీరెంత మంచి బౌలరో తెలుసుకోవాలంటే సచిన్ కు బౌలింగ్ చేస్తే సరి: శ్రీనాథ్
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పై వ్యాఖ్యానించాడు. ఓ బౌలర్ తన బౌలింగ్ ఏ స్థాయిలో ఉందన్న విషయం తెలుసుకోవాలంటే సచిన్ కు బౌలింగ్ చేస్తే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నాడు. తానైతే నెట్స్ లో సచిన్ కు బౌలింగ్ చేయడానికే ఇష్టపడేవాడినని శ్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు. సచిన్, ద్రావిడ్ లాంటి టాప్ బ్యాట్స్ మెన్ కు బంతులు విసరడం ద్వారా బౌలింగ్ లోపాలు తెలుసుకోవచ్చని వివరించారు. వారిద్దరినీ బోల్తా కొట్టించగలిగితే బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ కచ్చితంగా ఉన్నట్టు భావించాలని చెప్పాడు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కర్ణాటక పేస్ లెజెండ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.