: ధావన్ ఫిఫ్టీ.. భారత్ కు శుభారంభం
ఓపెనర్ శిఖర్ ధావన్ నాగపూర్ వన్డేలో ఫిఫ్టీ సాధించాడు. ఆసీస్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్ ఓపెనర్లు పటిష్ఠ పునాది వేశారు. ధావన్ (51 బ్యాటింగ్), రోహిత్ శర్మ (33 బ్యాటింగ్) తొలి వికెట్ కు అజేయంగా 17 ఓవర్లలో 92 పరుగులు జోడించారు. ఇక, భారత్ విజయానికి 33 ఓవర్లలో 259 పరుగులు కావాలి.