: వేలానికి మడోన్నా నగ్న చిత్రాలు


పాప్ క్వీన్ మడోన్నా నగ్న చిత్రాలు త్వరలో వేలానికి రానున్నాయి. మడోన్నా 18 ఏళ్ల వయసులో అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో డాన్స్ విద్యార్థినిగా ఉన్నప్పుడు పూటగడవడానికి నగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తూ తన విద్యను పూర్తి చేసింది. ఆ సమయంలో గంటసేపు ఫొటోలకు ఫోజులిస్తే ఫొటోగ్రాఫర్లు 10 డాలర్లు చెల్లించేవారు. ఎక్కువగా హెర్మన్ కుక్కర్ అనే ఫోటోగ్రాఫర్ మడోన్నా అందాలను తన కెమెరాతో బంధించేవాడు. హెర్మన్ తీసిన ఫోటోలను 'పెంట్ హౌస్' పత్రిక వ్యవస్థాపకుడు బాబ్ గుకియోన్ సేకరించగా, వాటిని న్యూయార్క్ కు చెందిన వ్యాపారవేత్త జెరిమీ ఫ్రామర్ కొనుగోలు చేశారు. ఈ ఫోటోలతో పాటు మరికొన్ని వస్తువులను ఫ్రామర్ వేలానికి ఉంచనున్నారు.

  • Loading...

More Telugu News