: ఢిల్లీ వెళ్లేందుకు జగన్ కు అనుమతి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. ఈ మేరకు జగన్ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు బెయిల్ షరతులను సడలించింది. దాంతో, ఢిల్లీతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ జగన్ వెళ్లేందుకు అంగీకరించింది. అంతేగాక హైదరాబాద్ వెలుపల పర్యటనకు రెండు రోజుల ముందు తమకు సమాచారం ఇవ్వాలని, ఫోన్ నంబర్ కూడా ఇవ్వాలని న్యాయస్థానం షరతు విధించింది.