: కాజోల్ గాజులు దొరికాయి


ముంబయిలోని బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో ఈ నెల 19న విలువైన బంగారు గాజులు చోరీకి గురైన సంగతి తెలిసిందే. 'కడ్వాచౌత్' పర్వదినం సందర్భంగా, కాజోల్ తన ఆభరణాల పెట్టెను తెరిచి చూడగా, 17 గాజులు దొంగతనానికి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కాజోల్, అజయ్ దేవ్ గణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5 లక్షలు. కాగా, చోరీకి పాల్పడిన ఇద్దరినీ గాయత్రి దేవేంద్ర, సంతోష్ పాండేలుగా గుర్తించారు. పారిశుద్ధ్య కార్మికులైన వీరిద్దరినీ కాజోల్ దంపతులు తమ నివాసంలో 'కడ్వాచౌత్' వేడుకల సందర్భంగా తాత్కాలిక పనివాళ్ళుగా నియమించుకున్నారు. వీరు అదను చూసి చేతివాటానికి పాల్పడినట్టు జుహు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News