: జబ్బార్ ట్రావెల్స్ ఎదుట బీజేపీ ఆందోళన
హైదరాబాదులోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను నిరసిస్తూ లక్డికాపూల్ లోని జబ్బార్ ట్రావెల్స్ వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలు.. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.