: లింగమార్పిడి వ్యక్తుల రిజర్వేషన్ల కోసం ఓ ఎమ్మెల్యే డిమాండ్
లింగమార్పిడి చేయించుకున్న వారికి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని తమిళనాడు అసెంబ్లీని ఓ ఎమ్మెల్యే కోరారు. స్త్రీలు.. పురుషులుగా, పురుషులు.. స్త్రీలుగా మారిపోవడాన్నే లింగమార్పిడి అంటారు. ఈ తరహా మైనారిటీలను సెక్సువల్ మైనారిటీలుగా మార్చాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఆ శాసనసభ్యుడు కోరారు. లింగమార్పిడి వారికి రిజర్వేషన్లు ఇవ్వడం ఆ వర్గం వారిలో నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. దీనికి సాంఘిక సంక్షేమ మంత్రి బి. వలర్ మతి స్పందిస్తూ.. లింగమార్పిడి వారికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని బదులిచ్చారు.